![]() |
![]() |
.webp)
శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఆషాఢం పెళ్లికొడుకులు కాన్సెప్ట్ తో వచ్చింది. ఇందులో గోరింటాకు సెగ్మెంట్ ఒకటి రన్ చేశారు. కొన్ని జంటల్ని పిలిచారు. అందులో ఆది - మహతి, మహేష్ - సాండ్రా , ధనుష్ - కీర్తి, మృదుల - కృష్ణ చైతన్య , ప్రవీణ్ వాళ్ళ వైఫ్ అంతా వచ్చారు. సెట్ లో ఉన్న గోరింటాకు చెట్ల నుంచి ఆకును కోసి అలాగే అక్కడే ఏర్పాటు చేస్తిన రోటిలో నూరి వాళ్ళ వాళ్ళ భార్యలకు పెట్టారు. ఆది ఐతే మహతికి పెద్ద అప్పచ్చి పెట్టాడు అరచేతికి. దాన్ని ఎపిసోడ్ ఎండింగ్ వరకు ఆరే వరకు ఉంచామని చెప్పింది రష్మీ.
ఫైనల్ గా అందరూ గోరింటాకును శుభ్రం చేసుకుని చూసుకున్నారు. ఐతే అందరి చేతుల్లోని గోరింటాకు ఆరెంజ్ కలర్ లో ఉంది అని జడ్జ్ ఇంద్రజ చెప్పుకొచ్చారు. కానీ మహతి చేతిలోని గోరింటాకు మాత్రమే ఎర్రగా పండిందని చూపించారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్న ఘట్టం ఇప్పుడు ఆది గారి విషయంలో వచ్చేసింది అంటూ ఇంద్రజ ఏడిపిస్తే...నెక్స్ట్ ఆషాఢ మాసానికి పెళ్ళికొడుకు రెడీగా ఉన్నాడు అంటూ రష్మీ ఆటపట్టించేసరికి ఆది తలదించుకున్నాడు.
పక్కనే ఉన్న మహతి తన చేతిలోని ఆది పెట్టగా ఎర్రగా పండిన గోరింటాకుని చూపిస్తూ తెగ మురిసిపోతూ పడీపడీ నవ్వుకుంటోంది. హైపర్ ఆది వెడ్స్ మైసూర్ మహతి అంటూ రష్మీ అనౌన్స్ చేసింది. ఆది కూడా ఆ మాటలకు ఎలాంటి ఎదురు చెప్పకుండా పంచులు వేయకుండా తెగ సిగ్గుపడిపోతూ నవ్వుకున్నాడు. రష్మీ ముందే చెప్పింది ఎర్రగా పండితే ఆ మొగుడు మీరే అంది. వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేసి చెప్పిందట "దేనికి పడితే దానికి గోరింటాకు పెట్టొద్దు" అని అన్నట్లు చెప్పాడు.
![]() |
![]() |